కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి

కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాకతీయ, కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం విమర్శించారు. ప్రజల్లో ఉద్రిక్తతలు రేకెత్తించే వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. వ్యక్తిగత ఆరోపణలు,...