ఆస్ట్రేలియా అత్యున్నత శిఖరంపై పెద్దపల్లి జెండా

ఆస్ట్రేలియా అత్యున్నత శిఖరంపై పెద్దపల్లి జెండా తండ్రీ - కొడుకుల అరుదైన ఘనత మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప‌ర్వ‌తారోహ‌ణ‌తో సందేశం కాకతీయ, పెద్దపల్లి : అంతర్జాతీయ పర్వతారోహకుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లెంకల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన లెంకల మహిపాల్ రెడ్డి తన కుమారుడు లెంకల వివేకానంద రెడ్డితో కలిసి ఆస్ట్రేలియా ఖండంలోని అత్యంత ఎత్తైన మౌంట్ కోసియాస్కో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. 2026 మే 2న ఈ అరుదైన ఘనతను సాధించారు....