క్యాంపు కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు

క్యాంపు కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు కరీంనగర్ బంద్‌కు ప్రజలు సహకరించాలి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు కాకతీయ, కరీంనగర్ : ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య భేదాభిప్రాయాలు సహజమని, అయితే కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తన క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఈ దాడికి పాల్పడిన దోషులు ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉందని...