పోలీసింగ్‌లో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి
పోలీసింగ్‌లో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి మంత్రి పొంగులేటిని కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్ కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం పోలీసింగ్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా, ఉన్నత శిఖరాలకు చేరుకునేలా కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ మంత్రికి పుష్పగుచ్ఛం అందజేయగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల...