ఇంద్రకీలాద్రిపై వైరా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ఇంద్రకీలాద్రిపై వైరా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కాకతీయ, కారేపల్లి : విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు మర్యాదపూర్వకంగా ఘనస్వాగతం పలికారు. ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్న ఎమ్మెల్యే.. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం...