మాలల అభివృద్ధిని విస్మరిస్తారా?
మాలల అభివృద్ధిని విస్మరిస్తారా? తక్షణమే మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మాల మహానాడు మండల అధ్యక్షుడు వేర్పుల నరేష్ కాకతీయ, మణుగూరు : "ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సాక్షిగా చేవెళ్ల డిక్లరేషన్‌లో ప్రకటించిన అంశాలను అమలు చేయకుండా మాలలకు అన్యాయం చేస్తారా?" అంటూ మాల మహానాడు నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం మణుగూరులోని మాల మహానాడు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేర్పుల నరేష్, బూర్గుల సతీష్ మాట్లాడారు. రాష్ట్రంలో...