విద్యార్థులకు విజ్ఞానం.. వినోదం

విద్యార్థులకు విజ్ఞానం.. వినోదం అశ్వాపురం పీఎంశ్రీ పాఠశాలలో 11 నుంచి వేసవి శిబిరం వినోదాత్మక రీతిలో నైపుణ్యాల పెంపునకు కృషి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యోగితావేణి కాకతీయ, అశ్వాపురం/మణుగూరు : "వేసవి సెలవుల్లో విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు, కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు సమ్మర్ క్యాంప్‌లు ఎంతగానో దోహదపడతాయి" అని అశ్వాపురం పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యోగితావేణి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణలో ఈనెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు విద్యార్థులకు ప్రత్యేక వేసవి శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు...