భీమేశ్వరాలయంలో భక్తుల సందడి
భీమేశ్వరాలయంలో భక్తుల సందడి దర్శించుకున్న 45 వేల మందికి పైగా భక్తులు కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో పోటెత్తింది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. రోజంతా కలిపి సుమారు 45 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో నిమగ్నమయ్యారు. తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు...