కోరపల్లి మత్స్య సంఘం ఎన్నిక ఏకగ్రీవం

కోరపల్లి మత్స్య సంఘం ఎన్నిక ఏకగ్రీవం అధ్యక్షుడిగా పింగిలి రమేష్‌ ఎంపిక కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు సభ్యులందరి సమక్షంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎక్కడా పోటీ లేకుండా సభ్యులందరూ ఏకాభిప్రాయంతో కొత్త కమిటీని ఎంపిక చేసుకోవడం విశేషం. సంఘం అధ్యక్షుడిగా పింగిలి రమేష్, ఉపాధ్యక్షుడిగా టంగుటూరి రామ్మోహన్, కార్యదర్శిగా మద్దెర్ల రమేష్ బాధ్యతలు చేపట్టారు....