మిల్లర్ల తరుగు దోపిడీ
మిల్లర్ల తరుగు దోపిడీ హకా కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో అన్యాయం అదనపు తూకంతో అన్నదాతల ఆవేదన కాకతీయ, చిగురుమామిడి : చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి హకా ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు తరుగు పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే, మిల్లర్లు రకరకాల వంకలతో కోతలు విధిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా, కొనుగోలు కేంద్రంలో ఒక్కో బస్తాకు 43.500 కిలోల చొప్పున...