ఏనుమాముల మార్కెట్‌లో భారీ మోసం

ఏనుమాముల మార్కెట్‌లో భారీ మోసం రూ. 2.50 కోట్లతో వ్యాపారి పరార్‌ కాకతీయ, వరంగల్: ఆసియాలోనే అతి పెద్దదైన వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో భారీ మోసం వెలుగుచూసింది. వ్యాపార లావాదేవీల పేరుతో తోటి వ్యాపారులను నమ్మించి, సుమారు రూ. 2.50 కోట్లతో ఒక వ్యాపారి తన కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో శ్రీవిద్య ట్రేడింగ్ ఫోరం పేరుతో ఖరీదు లైసెన్స్ పొందిన ఐలయ్య (అలియాస్ అరుణ్)...