ఉపాధి పనుల ఆకస్మిక తనిఖీ

ఉపాధి పనుల ఆకస్మిక తనిఖీ కూలీల సమస్యలపై డీఆర్డీఓ ఆరా ఆధార్‌ అనుసంధానమే సమస్యలకు పరిష్కారం ఫీల్డ్‌ లెవల్‌లో పనులను పరిశీలించిన జిల్లా అధికారి శ్రీరామ్‌ కాకతీయ, కారేపల్లి : మండల పరిధిలోని భజ్య తండా గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఖమ్మం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) శ్రీరామ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, కూలీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్న...