మారుమోగిన రామ నామస్మరణ

మారుమోగిన రామ నామస్మరణ రాయపర్తిలో మిన్నంటిన ఆధ్యాత్మిక ఉత్సాహం కొండగట్టుకు బయలుదేరిన అంజన్న స్వాములు కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండల కేంద్రంలోని పురాతన రామాలయం సోమవారం రామ నామస్మరణతో మారుమోగింది. హనుమాన్ మాలధారణ దీక్షలు ముగింపు దశకు చేరుకోవడంతో స్వాములు నిర్వహించిన ఇరుముడి కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగింది. భక్తులు, మాలధారుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఆలయ అర్చకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో ఇరుముడి (ముడుపు) కట్టే కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. పవిత్రమైన నెయ్యి, నైవేద్య ద్రవ్యాలతో కూడిన...