ఏసీబీ వలలో గంగాధర ఇన్‌ఛార్జ్ ఎస్‌ఆర్‌వో

ఏసీబీ వలలో గంగాధర ఇన్‌ఛార్జ్ ఎస్‌ఆర్‌వో పెద్దపల్లి రిజిస్ట్రార్ కార్యాలయ అక్రమాల కేసులో అరెస్ట్ నిజామాబాద్ నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు కాకతీయ, కరీంనగర్ : పెద్దపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో వెలుగుచూసిన అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ ఎస్‌ఆర్‌వోగా విధులు నిర్వహిస్తున్న మండ కిరణ్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. పెద్దపల్లి కార్యాలయంలో పనిచేసిన కాలంలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే...