నేరడలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
నేరడలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి అభిషేకాలు, అన్నదానంలో పాల్గొన్న భక్తులు కాకతీయ, చింతకాని : చింతకాని మండలం నేరడ గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారిని పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ పూజారి ఇంగువ గిరిశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జయంతి వేడుకలను పురస్కరించుకుని...