సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత
సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని కాకతీయ, కొత్తగూడెం: హనుమాన్ జయంతి పర్వదినం భక్తిశ్రద్ధల సమాహారమని, మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ...