ఖమ్మం అభివృద్ధి ప్రదాత తుమ్మల

ఖమ్మం అభివృద్ధి ప్రదాత తుమ్మల రాష్ట్రంలోనే అవినీతి మ‌చ్చ‌లేని ఆదర్శ నేత ఆత్మీయ సభలో ఎమ్మెల్యే కూనంనేని ప్రశంసలు కాకతీయ, కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధిలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది చెరగని ముద్ర అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొనియాడారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్‌ పంచాయతీ పరిధిలోని కమ్మ సత్రంలో నిర్వహించిన 'తుమ్మల ఆత్మీయ సభ'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య భారీ కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు....