భద్రాద్రి జిల్లాలో ‘ఫేక్ ఫోన్‌పే’ కలకలం: రూ. 5 వేల సరుకులతో కేటుగాడు జంప్!
భద్రాద్రి జిల్లాలో ‘ఫేక్ ఫోన్‌పే’ కలకలం రూ. 5 వేల సరుకులతో ఉడాయించిన కేటుగాడు జిల్లాలో ఇది రెండో సంఘటన.. ఆందోళనలో వ్యాపారులు కాకతీయ, భద్రాచలం (మణుగూరు) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘ఫేక్ ఫోన్‌పే’ ముఠా కలకలం రేపుతోంది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని అమాయక వ్యాపారులను కేటుగాళ్లు నిలువునా ముంచుతున్నారు. తాజాగా భద్రాచలం పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానిక వ్యాపారులను ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం పట్టణంలోని నెహ్రూ మార్కెట్ సమీపంలో ఉన్న ఒక కిరాణా దుకాణానికి ఒక అపరిచితుడు...