కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీపీ సింగిరెడ్డి

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీపీ సింగిరెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మండలంలోని గాలిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు...