గ్యాస్ సిలిండర్లకు ‘వీఐపీ’ భద్రత: పోలీసు ఎస్కార్ట్ మధ్య సరఫరా.. ఎక్కడంటే?

గ్యాస్ సిలిండర్లకు ‘వీఐపీ’ భద్రత లూటీ భయంతో ఎస్కార్ట్ మధ్య సరఫరా మహబూబాబాద్ జిల్లా పెద్ద ముప్పారంలో అసాధారణ దృశ్యం కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల సెగ సామాన్యుడి వంటగదికి తగిలింది. యుద్ధ మేఘాల కారణంగా దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో, సిలిండర్ల పంపిణీ ఇప్పుడు పోలీసుల కంచుకోట మధ్య సాగుతోంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో విఐపీల కాన్వాయ్ తరహాలో పోలీసు ఎస్కార్ట్ మధ్య గ్యాస్ సిలిండర్లను తరలించడం చర్చనీయాంశంగా...