డ్రంక్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు
డ్రంక్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు చందుర్తి సీఐ రవీందర్ కాకతీయ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిఐ రవీందర్, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామంలో ప్రధాన రహదారుల వద్ద వాహనాలను ఆపి డ్రైవర్లకు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ...