అన్నదాతలను ముంచుతున్న ప్రభుత్వం

అన్నదాతలను ముంచుతున్న ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి చెల్పూర్ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ కాకతీయ, భూపాలపల్లి : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను విస్మరించి అన్నదాతలను నిలువునా ముంచుతోందని భూపాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి విమర్శించారు. శుక్రవారం గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కల్లాల్లో వడ్లు ఆరబోసి వారాల తరబడి రైతులు నిరీక్షిస్తున్నా, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన...