నల్గొండలో ఘోరం: మనవడిని కాపాడబోయి.. బోరుబావిలో ఇరుక్కుని ఉపసర్పంచ్ మృతి!

మనవడిని కాపాడబోయి.. బోరుబావిలో ఇరుక్కుని తాత మృతి కాకతీయ, తెలంగాణ బ్యూరో : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు గుంతలో పడిపోయిన నాలుగేళ్ల మనవడిని కాపాడేందుకు వెళ్లి, అదే గుంతలో ఇరుక్కుపోయి తాత మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం ఊట్లపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ వెంకన్న తన మనవడితో కలిసి పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు అక్కడ తెరిచి ఉన్న బోరు గుంతలో...