అంజనాద్రి క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో మహా లింగార్చన
అంజనాద్రి క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో మహా లింగార్చన కాకతీయ, కరీంనగర్/ భగత్‌నగర్ : పురుషోత్తమ మాసం (అధిక జ్యేష్ఠ మాసం) సందర్భంగా కరీంనగర్ భగత్‌నగర్‌లోని అంజనాద్రి క్షేత్రం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం గుట్టపై ఆదివారం రాత్రి మహా లింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేములవాడ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.సాయంత్రం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద మంత్రోచ్చారణల నడుమ శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పురుషోత్తమ మాసంలో మహా లింగార్చనకు ప్రత్యేక...