ఆశ్రమ భూమిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి యత్నం

ఆశ్రమ భూమిలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి యత్నం సేవ కోసం ఇచ్చిన స్థలంపై రాజకీయ కన్ను ఆశ్రమాన్ని కాపాడాలంటున్న చార్వాక ట్రస్ట్ కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో వృద్ధుల ఆశ్రమానికి కేటాయించిన ప్రభుత్వ భూమిలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించాలనే యత్నాలపై చార్వాక ట్రస్ట్ సభ్యులు, వృద్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని...