బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ ధర్నాలు
బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ ధర్నాలు నేతన్న చౌరస్తాలో పరస్పరం చెప్పులు విసురుకున్న కార్యకర్తలు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు సిరిసిల్ల పట్టణంలో హైటెన్షన్.. భారీగా మోహరించిన బలగాలు.. కాకతీయ, రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో సోమవారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగగా, దానికి కౌంటర్‌గా బీజేపీ శ్రేణులు కూడా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చాయి. నగరంలోని ప్రధాన కూడలి అయిన నేతన్న చౌరస్తా వేదికగా...