బండి రాజీనామాకు బీఆర్‌ఎస్ డిమాండ్
బండి రాజీనామాకు బీఆర్‌ఎస్ డిమాండ్ తెలంగాణ చౌక్‌లో నిరసన.. తోపులాటతో ఉద్రిక్తత కాకతీయ, కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం ఆందోళనకు దిగాయి. నగరంలోని ప్రధాన కూడలి అయిన తెలంగాణ చౌక్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నిరసన చేపట్టారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్...