ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన
ఇంధన ధరల పెంపుపై సీపీఎం నిరసన మండల కార్యదర్శి యాసా నరేష్ మండిపాటు కాకతీయ, జూలూరుపాడు : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడు ఎన్నికలు ముగిసినా ప్రజలపై భారాలు మోపడం బీజేపీ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలను పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు....