రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మురిపిరాల గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన బక్కతట్ల కుమారస్వామి (22) ఆదివారం ఉదయం పని నిమిత్తం తొర్రూర్ మండలంలోని వెంకటాపురం గ్రామానికి వెళ్లాడు. పని ముగిసిన అనంతరం రాత్రి పల్సర్ ద్విచక్ర వాహనంపై దమ్మన్నపేటకు తిరుగుప్రయాణమయ్యాడు. రాత్రి...