మేడిపల్లిలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

మేడిపల్లిలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ యూరియా వినియోగం తగ్గించాలని సూచన కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండలం మేడిపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. డి. వీరన్న మాట్లాడుతూ.. రైతులు అవసరానికి మించి యూరియా వాడొద్దని, సమతుల్య ఎరువులతోనే స్థిరమైన దిగుబడులు సాధ్యమని స్పష్టం చేశారు. మండల వ్యవసాయ అధికారి బి. రజిత మాట్లాడుతూ.. పంటల మార్పిడి,...