యువత ఆరోగ్యమే లక్ష్యం.. యోగాతో డ్రగ్స్‌కు చెక్

యువత ఆరోగ్యమే లక్ష్యం.. యోగాతో డ్రగ్స్‌కు చెక్ కారేపల్లి జూనియర్ కాలేజీ మైదానంలో భారీ అవగాహన సదస్సు మాదకద్రవ్యాల నివారణే ధ్యేయంగా ప్రభుత్వ కార్యక్రమం హాజరైన మండల అధికారులు, సర్పంచులు, విద్యార్థులు కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానం ఆరోగ్య చైతన్యానికి వేదికగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం విజయవంతమైంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి...