నిబంధనలు పాటిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు!
నిబంధనలు పాటిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు! నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు ఇచ్చేది లేదు నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హన్మకొండ కలెక్టర్ కొలతలను స్వయంగా తనిఖీ చేసిన చాహత్ బాజ్‌పాయ్ కాకతీయ, వరంగల్ : నగర పరిధిలో భవన నిర్మాణ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిగా పాటించిన వారికే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని హనుమకొండ జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె నగరంలోని ప్రశాంత్‌నగర్, అశోక్ కాలనీ, సిద్ధార్థ్‌నగర్, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో నిర్మించిన పలు భవనాలను ప్రత్యక్షంగా పరిశీలించారు....