ఈదురు గాలులతో మానాల అతలాకుతలం!

ఈదురు గాలులతో మానాల అతలాకుతలం! చెట్లు నేలకొరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల ప్రభావంతో గ్రామంలోని పలు భారీ వృక్షాలు ఒక్కసారిగా నేలకొరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రధాన రహదారిపై పెద్ద చెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గాలుల తీవ్రతకు గ్రామంలోని సెంట్రల్ లైటింగ్ స్టాండ్ కూడా నేలమట్టమైంది. మరికొన్ని...