తూతూ మంత్రంగా ‘హెరిటేజ్ వాక్’!
తూతూ మంత్రంగా ‘హెరిటేజ్ వాక్’! మొక్కుబడి నిర్వహణపై జాకారం స్థానికుల ఆగ్రహం ముందస్తు సమాచారం లేక వెలవెలబోయిన కార్యక్రమం నాకేం సంబంధం లేదంటూ టూరిజం అధికారి శివాజీ పొంతన లేని సమాధానాలు కాకతీయ, ములుగు ప్రతినిధి : కాకతీయుల అద్భుత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా బుధవారం నిర్వహించిన ‘హెరిటేజ్ వాక్’ (వారసత్వ నడక) కార్యక్రమం తూతూ మంత్రంగా ముగిసింది. ములుగు జిల్లా జాకారం శివాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం...