నిప్పంటించడంతో కూలిపోయిన భారీ వృక్షం..

నిప్పంటించడంతో కూలిపోయిన భారీ వృక్షం.. ముదిగొండ–మేడిపల్లి రహదారిపై ప్రజలకు నరకయాతన కాకతీయ, ముదిగొండ : ఖమ్మం జిల్లా ముదిగొండ నుండి మేడిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వృక్షానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో అది పూర్తిగా బలహీనపడి చివరకు రోడ్డుపై కూలిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టు కారణంగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర పనుల కోసం వెళ్లేవారు రోడ్డుపైనే చిక్కుకుపోయారు. చెట్టు వేర్ల వద్ద మంటలు చెలరేగి...