గిరిజన చెరువుల్లో గిరిజనేతరుల చేపల వేట
గిరిజన చెరువుల్లో గిరిజనేతరుల చేపల వేట 11.50 టన్నుల చేపల దోపిడీ జరిగిందంటూ ఆదివాసీల ఆరోపణలు చర్యలు చేపట్టాలని ‘తుడుందెబ్బ’ డిమాండ్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం షాపల్లి పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువులో గిరిజన మత్స్యకారుల సొసైటీ హక్కులను ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు చేపల అక్రమ వేట కొనసాగిస్తున్నట్లు ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. పెసా చట్టం కింద గ్రామసభ తీర్మానం ద్వారా గిరిజన మత్స్యకారులకే ఈ చెరువును కేటాయించారని, అయినప్పటికీ కొందరు గిరిజనేతరులు నిబంధనలకు...