ఏజెన్సీలో చిరుత సంచారం.. పాదముద్రలు గుర్తింపు
ఏజెన్సీలో చిరుత సంచారం.. పాదముద్రలు గుర్తింపు వెంకటాపురం - చర్ల సరిహద్దుల్లో అటవీ శాఖ తనిఖీలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగొద్దని హెచ్చరిక కాకతీయ, నూగూరు వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎదిర గుట్టలు, యాకన్నగూడెం, సుబ్బంపేట ప్రాంతాల సరిహద్దుల్లో చిరుత తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిరుతకు సంబంధించిన అనుమానాస్పద పాదముద్రలను...