దళిత ఉద్యోగులపై బెదిరింపులు ఆపాలి
దళిత ఉద్యోగులపై బెదిరింపులు ఆపాలి అధికారులను భయపెట్టి తప్పు చేయించాలని చూస్తే ఊరుకోం దళిత అధికారులకు అండగా ఉంటాం దళిత సంఘాల జేఏసీ నాయకుడు సోంపల్లి తిరుపతి కాకతీయ, పినపాక (మణుగూరు): పినపాక మండలంలో కొంతమంది రాజకీయ నాయకులు దళిత అధికారులపై, ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడటం సరికాదని దళిత సంఘాల జేఏసీ నాయకుడు సోంపల్లి తిరుపతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమకు అనుకూలంగా పనిచేస్తే జేజేలు కొట్టడం, నిబంధనల ప్రకారం వ్యతిరేకంగా పనిచేస్తే బెదిరింపులకు దిగడం వంటి చర్యలను దళిత సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు....