పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం మొలంగూర్ హైస్కూల్‌లో ఆత్మీయ వేడుక ఉపాధ్యాయులకు ఘన సన్మానం.. పాఠశాలకు వస్తువుల విరాళం కాకతీయ,శంకరపట్నం: శంకరపట్నం మండలం మొలంగూర్ ఉన్నత పాఠశాలలో 2003-04 విద్యాసంవత్సరానికి చెందిన ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. సుమారు 23 ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న మిత్రులు, తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞత చాటుకున్నారు....