ఏడుగురు యువకులపై కేసు నమోదు
ఏడుగురు యువకులపై కేసు నమోదు పోలీసులపైనే దాడికి యత్నించిన ఫలితం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో పోలీసులపైనే దాడికి యత్నించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పస్రా ఎస్ఐ ఎస్‌కే తాజుద్దీన్ తీసుకున్న తక్షణ చర్యలను అభినందించారు. రెండు వర్గాలుగా విడిపోయి బహిరంగంగా మద్యం సేవిస్తూ ఘర్షణకు దిగిన యువకులు, శాంతింపజేయడానికి వచ్చిన ఎస్ఐ తాజుద్దీన్‌ను వెనక్కి తోసేసి...