సిరిసిల్లలో “మందుబాబుల వినతి పత్రం” వైరల్!
సిరిసిల్లలో “మందుబాబుల వినతి పత్రం” వైరల్! మద్యం ధరలు పెంచొద్దంటూ కలెక్టర్‌కు లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న పోస్ట్ నెట్టింట మీమ్స్, ట్రోల్స్‌తో నవ్వుల పువ్వులు కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన ఒక వినూత్న వినతిపత్రం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. “మద్యం ప్రియుల సంక్షేమ సంఘం” పేరిట జిల్లా కలెక్టర్‌కు రాసినట్లు ప్రచారంలో ఉన్న ఓ లేఖ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ హల్‌చల్ చేస్తోంది. ...