వేములవాడలో హిమాన్షు రావు పూజలు

వేములవాడలో హిమాన్షు రావు పూజలు భీమేశ్వర స్వామిని దర్శించుకున్న కేటీఆర్ తనయుడు వేద మంత్రోచ్చారణల మ‌ధ్య ఆలయ అర్చకుల ఘన స్వాగతం తీర్థప్రసాదాలు అందజేసిన ఈఓ రమాదేవి కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు సోమవారం పర్యటించారు. తన స్నేహితులతో కలిసి వచ్చిన ఆయన.. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న హిమాన్షు...