పారిశుధ్య కార్మికురాలిపై అధికారి వేధింపులు..?
పారిశుధ్య కార్మికురాలిపై అధికారి వేధింపులు..? ఇంటి పనులు చేయాలంటూ అదనపు కమిషనర్ ఒత్తిడి? పీఎస్‌లో విచారణ పేరిట వేధింపులపై బాధితురాలి ఆవేదన అదనపు కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని కార్మిక సంఘాల ధర్నా కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్)లో పనిచేస్తున్న ఒక మహిళా పారిశుధ్య కార్మికురాలిపై ఉన్నతాధికారి వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు నగరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కార్పొరేషన్ అదనపు కమిషనర్ సువార్త తన నివాసంలో ఇంటి పనులు చేయాలంటూ ఒత్తిడి తెచ్చారని, దానికి నిరాకరించినందుకు పారిశుధ్య కార్మికురాలు రేవెని...