రహదారి పనుల్లో నాణ్యత లోపాలు!
రహదారి పనుల్లో నాణ్యత లోపాలు! రోడ్డును ప్రమాదకరంగా మారుస్తున్న కాంట్రాక్టర్ 56 మూలమలుపులను సరిచేయకుండానే పనులు అధికారుల నిర్లక్ష్యంపై టీడీపీ నేత బొల్లుమల్ల సదానందం ఆగ్రహం కాకతీయ, చిగురుమామిడి : సుందరగిరి నుండి హుస్నాబాద్ కు జరుగుతున్న నాలుగు వరుసల రహదారి (ఫోర్ లేన్) నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించాయని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొల్లుమల్ల సదానందం ఆరోపించారు. సోమవారం ఈ రహదారి పనులను టీడీపీ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో...