సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు బ్రేక్!
సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు బ్రేక్! కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు రోజులుగా పడిగాపులు తీవ్ర ఎండల్లో వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు కార్యాలయంలో కనీస వసతులు లేవని ప్రజల ఆగ్రహం కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాంకేతిక సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత మూడు రోజులుగా సర్వర్ మొరాయించడంతో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. దీంతో స్థలాలు, ఇళ్ల కొనుగోలు, విక్రయాల కోసం వచ్చిన ప్రజలు, దస్తావేజు లేఖరులు (డాక్యుమెంట్ రైటర్లు) గంటల తరబడి...