తాడికల్‌లో ఘనంగా మహిళా వారోత్సవాలు

తాడికల్‌లో ఘనంగా మహిళా వారోత్సవాలు మహిళలకు పోషకాహారం, బాల్య వివాహాలపై అవగాహన కాకతీయ,శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అరుణ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఐరన్, ఇతర పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను రోజువారీ ఆహారంలో...