వడదెబ్బతో టైలర్ మృతి

వడదెబ్బతో టైలర్ మృతి ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూత కాకతీయ,ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారంలో వడదెబ్బతో టైలర్ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఏటూరునాగారం గ్రామానికి చెందిన వెంకన్న (41) అనే టైలర్ కొద్ది రోజుల క్రితం తన అత్తగారి ఇంటికి వెళ్లిన సమయంలో తీవ్ర ఎండల ప్రభావంతో వడదెబ్బకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ ద్వారా ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకన్న...