కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అరుణ్‌కుమార్
కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అరుణ్‌కుమార్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా కొరివి అరుణ్‌కుమార్‌ను రెండోసారి నియమించారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయనకు ఈ నియామక పత్రాన్ని అందజేశారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్, తెలంగాణ ఎస్సీ విభాగం అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా అరుణ్‌కుమార్ ఈ పత్రాన్ని అందుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్...