ప్రత్యామ్నాయం చూపించాకే తొలగించాలి
ప్రత్యామ్నాయం చూపించాకే తొలగించాలి చిరు వ్యాపారుల పొట్టకొట్టడం అన్యాయం సంఘం అధ్యక్షుడు గజ్జెల లింగమూర్తి ఆవేదన కాకతీయ, వరంగల్: వరంగల్ హెడ్ పోస్టాఫీస్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా కొన్నేళ్లుగా సాగుతున్న చిరు వ్యాపారాలను ప్రత్యామ్నాయం చూపకుండా ఉన్నపళంగా తొలగించడం సరికాదని చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు గజ్జెల లింగమూర్తి అన్నారు. జేసీబీలతో భయభ్రాంతులకు గురిచేస్తూ దుకాణాలను తొలగించడం బాధాకరమన్నారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా వ్యాపారాలు బంద్ చేయిస్తే వారి కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి స్పందించి ఈ విషయాన్ని...