ఘనంగా బక్రీద్ వేడుకలు

ఘనంగా బక్రీద్ వేడుకలు ఆత్మకూరు మండల వ్యాప్తంగా ముస్లింల ప్రత్యేక సామూహిక ప్రార్థనలు ఈద్గాల వద్ద వెల్లివిరిసిన మతసామరస్యం.. కాకతీయ, ఆత్మకూరు: త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పండుగను ఆత్మకూరు మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు హౌజుబుజుర్గు, కటాక్షపూర్, పెద్దాపురం, అక్కంపేట, మలక్‌పేట, పెంచికలపేట తదితర గ్రామాల్లోని ముస్లింలు తెల్లవారుజాము నుంచే నూతన వస్త్రాలు ధరించి ఈద్గా మైదానాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక సామూహిక నమాజ్ నిర్వహించి, దేశ శాంతి, సౌభాగ్యాల...